»Brahmotsavam Begins As A Celebration In Srisailam
Srisailam Shivratri Brahmotsavam: శ్రీశైలంలో వేడుకగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం
మహాశివరాత్రి(Maha Shivratri) సందర్భంగా దేశంలోని శివాలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. పండగ సందర్భంగా శ్రీశైలంలో ఫిబ్రవరి 11వ తేది నుంచి బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) ప్రారంభమయ్యాయి.
మహాశివరాత్రి(Maha Shivratri) సందర్భంగా దేశంలోని శివాలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. పండగ రోజు భక్తులు ఉపవాసాలు ఉండి శివాలయాన్ని దర్శించుకుంటారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ రోజు భక్తులు జాగారం చేస్తారు. శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతాయి. ఏపీలోని శ్రీశైలం భక్తులతో కిక్కిరిసిపోతుంది. శివ మాల ధరించిన భక్తులు భారీగా శ్రీశైలానికి తరలివస్తుంటారు. పండగ సందర్భంగా శ్రీశైలంలో ఫిబ్రవరి 11వ తేది నుంచి బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) ప్రారంభమయ్యాయి.
తాజాగా నేటి ఉదయం 8.46 గంటలకు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి, అమ్మవార్లకు శనివారం శ్రీకాళహస్తీశ్వర దేవాలయం, 13న దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం, 14న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం, ఆ రోజు సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం(TTD), 15వ తేదిన రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
శ్రీశైలం బ్రహ్మోత్సవాల(Brahmotsavam)లో భాగంగా పలు వాహన సేవలను వైభవంగా నిర్వహించనున్నారు. 11వ తేదిన ధ్వజారోహణం వేడుకగా సాగింది. 12న భృంగి వాహనసేవ, 13న హంస వాహనసేవ, 14న మయూర వాహనసేవ, 15న రావణ వాహనసేవ, 16న పుష్ప పల్లకీ సేవ, 17న గజ వాహనసేవలను ఆలయ అధికారులు నిర్వహించానున్నారు. అదేవిధంగా 18వ తేదిన మహాశివరాత్రి(Maha Shivratri), ప్రభోత్సవం, నంది వాహనసేవను ఆలయ అధికారులు నిర్వహించనున్నారు.
మహాశివరాత్రి(Maha Shivratri) పర్వదినాన్ని పురష్కరించుకుని లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, స్వామి, అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం కార్యక్రమాలు వేడుకగా జరగనున్నాయి. 19వ తేదిన రథోత్సవం, తెప్పోత్సవం, 20న యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, 21వ తేదిన అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం వంటివి ఆలయ అధికారులు నిర్వహించనున్నారు.
శివరాత్రి(Maha Shivratri) బ్రహ్మోత్సవాల రోజుల్లో శ్రీశైలం ఆలయ దర్శన విధానాల్లో పలు మార్పులు చేశారు. ఈ విషయాన్ని అధికారులు భక్తులకు తెలియజేశారు. బ్రహ్మోత్సవాలకు రెండు రోజుల ముందుగా అంటే ఫిబ్రవరి 9వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) ముగిసిన తరువాత 23వ తేదీ వరకు 15 రోజులపాటు శివ స్వాములు జ్యోతిర్ముడి సమర్పణకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇరుముడి ధారణస్వాములకు మాత్రం 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్ధిష్ట వేళలో మల్లిఖార్జునుడి స్పర్శదర్శనం కల్పించనున్నట్లు శ్రీశైలం ఆలయ అధికారులు వెల్లడించారు.