ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై (YCP) ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమవుతోంది. గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం కోసం ప్రజల మధ్యకు వెళ్తున్న మంత్రులు (Ministers), వైసీపీ ఎమ్మెల్యేలకు చుక్కెదురవుతోంది. రోడ్లు, నీళ్లు, అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలు నిలదీస్తున్నారు.. ప్రశ్నిస్తున్నారు (Questioning). ప్రజల నుంచి నిరసన (Protest) వ్యక్తమవుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రజలపై దాడికి పాల్పడుతున్నారు.
ఈ క్రమంలోనే మరో వైసీపీ ఎమ్మెల్యేకు ఘోర అవమానం ఎదురైంది. ఈసారి ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే వస్తున్నాడని తెలుసుకుని ఇళ్లకు తాళాలు (Locks) వేసి గ్రామస్తులంతా వెళ్లిపోయారు. దీంతో ఊరంతా నిర్మానుష్యమైంది. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే (MLA) అవాక్కయ్యారు. అతడిని తాళాలు వెక్కిరించాయి. ఈ ఘోర పరాభవం పూతలపట్టు ఎమ్మెల్యే (Puthalapattu MLA) ఎంఎస్ బాబుకు (MS Babu) ఎదురైంది. వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరు జిల్లా (Chittoor District) పూతలపట్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాబు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పేట అగ్రహారం (Peta Agraharam) అనే గ్రామంలో బుధవారం పర్యటించాల్సి ఉంది. ఎమ్మెల్యే వస్తున్నారని తెలుసుకున్న గ్రామస్తులు (Villagers) ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. అధికారులు, వాలంటీర్లు, అనుచరులతో గ్రామంలోకి రాగా వారికి మూసి ఉన్న తలుపులు (Doors Closed) కనిపించాయి. నాలుగేళ్లుగా తమకు ఎమ్మెల్యే చేసిందేమీ లేదంటూ నిరసనగానే గ్రామం గ్రామమంతా ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పేందుకు ఇలా చేశారని తెలుస్తున్నది. కాగా ఎమ్మెల్యే వచ్చివెళ్లాక గ్రామస్తులు వీధులన్నీ పసుపు నీళ్లతో (Haldi Water) శుద్ధి చేశారు. వైసీపీ ఎమ్మెల్యే రాకతో గ్రామానికి మైల అంటిందని భావించారు.
కాగా ఈ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు ఇలాంటి సంఘటనలు సర్వసాధారణమే. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వారం కిందట కూడా ఓ గ్రామంలో పర్యటించగా.. గ్రామస్తులు ఎమ్మెల్యే రాకను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసి మూడు చెరువుల నీళ్లు తాగించారు. దీంతో గ్రామాల్లో పర్యటించేందుకు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు జంకుతున్నారు. కానీ సీఎం జగన్ టార్గెట్ ఇవ్వడంతో విధి లేక ప్రజల మధ్యకు వెళ్తున్నాడు.