TPT: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం HPV వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రకాశం రోడ్-1 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ ప్రారంభించారు. జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో 14 ఏళ్ల బాలికలకు ఈ టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలో గుర్తించిన 14,455 మంది బాలికలకు వ్యాక్సిన్ అందించనున్నట్లు తెలిపారు.