NTR: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శనివారం సాయంత్రం అమరవీరుడు జవాన్ మురళి నాయక్‌కు సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళి నాయక్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన అన్నారు.