ASR: చాపరాయి జలవిహారిలో స్థానికులకు ఉపాధి కల్పించాలని చాపరాయి జలవిహారి అభివృద్ధి సొసైటీ కోశాధికారి అరుణ్ రాజ్ ఆదివారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోతంగి పంచాయతీకి చెందిన 10 మంది నిరుద్యోగ యువతి, యువకులకు ఉపాధి కల్పించేందుకు పంచాయతీ పాలకవర్గం తీర్మానించిందని, వీరిలో అయిదుగురికి మాత్రమే ఉపాధి కల్పించి.. మిగిలినవారికి మొండిచేయి చూపారన్నారు.