NDL: అవుకు మండలంలోని వారి సాగు చేసిన ప్రతి రైతుకు యూరియా అందించేందుకు చర్యలు చేపట్టామని మండల వ్యవసాయ అధికారి కలి మున్నిసా తెలిపారు. టోకెన్లు మంజూరైన రైతులకు ఆదివారం సాయంత్రం వరకు పలు రైతు సేవా కేంద్రాల్లో యూరియా పంపిణీ కొనసాగిందని పేర్కొన్నారు. కాగా ఆర్ఎస్కే కేంద్రాల్లో సరఫరా పరిస్థితిని ఆమె స్వయంగా పరిశీలించారు. రైతులు ఆందోళన చెందవద్దని ఆమె కోరారు.