ప్రకాశం: కొండపి పట్టణంలోని శివారు పరిసర ప్రాంతాలలో ఆదివారం ఎస్సై ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక క్లీన్ ఆఫ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం బాటిల్స్తోపాటు పలు రకాల చెత్త వేస్తూ అపరిశుభ్రత వాతావరణం ఉన్న ప్రాంతాలను గుర్తించి పోలీసులు శుభ్రం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషిద్ధమని ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు.