W.G: తణుకు జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా పడింది. తాడేపల్లిగూడెం నుంచి తణుకు వైపు ఫ్రూట్స్ లోడుతో వస్తున్న ఆటో తేతలి వై జంక్షన్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న డ్రైవర్ క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరిపించుకున్నారు. ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనాదారులు తెలిపారు.