NTR: కృష్ణా జలాలను కాపాడుకుందామని జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ప్రజలకు పిలుపునిచ్చారు. జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ, అనుమోలు గాంధీ ఆధ్వర్యంలో హంసల దీవి నుంచి మొదలైన కృష్ణా జలయాత్ర శనివారం విజయవాడకు చేరుకుంది. ఇక్కడ కృష్ణా జలయాత్ర కార్యక్రమాన్ని సామినేని ఉదయభాను ప్రారంభించారు.