అన్నమయ్య: మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం జరిగిన పత్రికా సమావేశంలో మందుల కొరత, సెక్యూరిటీ లోపాలపై ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎముకల వైద్యుడిని తక్షణమే సస్పెండ్ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఏ సమస్య వచ్చినా వెంటనే RMO, సూపరింటెండెంట్‌కు తెలియజేయాలని సూచిస్తూ, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడటం ప్రతి డాక్టర్ బాధ్యత అని తెలిపారు.