E.G: నల్లజర్ల మండలం దూబచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గురువారం సందర్శించారు. ఈ మేరకు ఒత్తిడి లేని విద్య- ఉత్తమ ఫలితాలు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని, ఉత్తమ సాధించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు ఎమ్మెల్యే హాల్ టికెట్లు పెన్నులు, ప్యాడ్లు అందజేశారు.