GNTR: ప్రేమ, శాంతి ఏసుప్రభు చూపిన మార్గాలని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు. శనివారం నరసరావుపేటలోని స్థానిక లూధరన్ చర్చిలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో సోదర భావం పెరిగి అన్ని కుటుంబాలకు మంచి జరగాలని ఆకాంక్షించారు.