ELR: ఏలూరు నగరపాలక సంస్థ శానిటరీ సమావేశంలో ఎమ్మెల్యే బడేటి చంటి శానిటరీ సిబ్బందిపై ఆగ్రహించారు. నగరంలో ఎక్కడ చెత్త కనిపించిన స్వయంగా తాను తొలగిస్తానని అన్నారు. సిబ్బంది సక్రమంగా పని చేయకపోతే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. పారిశుద్ధ్య నిర్వహణ లోపించిందని పత్రికల్లో వస్తుందని, నగర పారిశుద్ధ్యం కోసం సిబ్బంది పని చేయాలని ఆదేశించారు.