VZM: రాజాం MLA కొండ్రు మురళీమోహన్ సూచనలు మేరకు రాజాం, రేగిడి, సంతకవిటి, వంగర క్లస్టర్లకు చెందిన ఇన్ఛార్జ్లు మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంలో గురు, శుక్రవారాలలో రెండు రోజుల పాటు జరిగిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేయడం, పలు కీలక అంశాలపై పార్టీ దిశానిర్దేశం చేయడం శిక్షణ ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు.