ఏలూరు కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులతో శనివారం అదనపు ఎస్పీ అడ్మిన్ సూర్యచంద్రరావు సమావేశం నిర్వహించారు. ఏలూరు, జంగారెడ్డి గూడెం, నూజివీడు, పోలవరం సబ్ డివిజన్లకు చెందిన కోర్టు మానిటరింగ్ సభ్యులతో మాట్లాడారు. సాక్షుల హాజరు కేసుల విచారణ వేగవంతంగా జరగాలంటే సాక్షులను సమయానికి హాజరు పరచడం తప్పనిసరి అని అన్నారు. నేరస్తులు శిక్షను తప్పించుకోకూడదని చెప్పుకొచ్చారు.