ప్రకాశం: ప్రజలు అందజేసిన అర్జీలు గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ తమీమ్ అన్సారీయా అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, అర్జీలు స్వీకరించారు. గడువులోపు అర్జీలు పరిష్కరించని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.