కృష్ణా జిల్లా వీరపనేనిగూడెం డాక్టర్ అంబేడ్కర్ గురుకులం ప్రిన్సిపాల్ గ్రేడ్-1 యశోద లక్ష్మి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున లభించిన ఈ అవార్డు APSWREISకు ప్రతిష్టతను తీసుకువచ్చింది. తన కృషి, నిబద్ధతతో విద్యార్థుల అభ్యున్నతికి విశేష సేవలందించిన యశోద లక్ష్మికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.