కోనసీమ: రామచంద్రపురం మండలం వేగాయమ్మపేటలో బుధవారం విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కౌలు రైతు గుబ్బల సూరిబాబు (35) దాళ్వా వరిగడ్డిని పొలంలో తగులబెడుతుండగా ఒక్కసారిగా చెలరేగిన పొగలో చిక్కుకొని ఊపిరాడక మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ద్రాక్షారామ ఎస్ఐ లక్ష్మణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కౌలురైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.