ప్రకాశం: కంభం మండలం కందులాపురం గ్రామంలో హౌస్ టాక్స్ మరియు UF సర్వే పనులను ఎంపీడీవో వీరభద్రచారి ఇవాళ పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న సర్వే పురోగతిని అధికారులు, సిబ్బందితో కలిసి సమీక్షించి, మిగిలిన గృహాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వే నిర్వహించాలని, హౌస్ టాక్స్ వివరాలను సక్రమంగా నమోదు చేయాలని ఎంపీడీవో పేర్కొన్నారు..