SKLM: విద్యతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ఎస్సై వి. సత్యన్నారాయణ అన్నారు. కోటబొమ్మాలి మండలం ఎత్తు రాళ్లపాడు పంచాయతీ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో మంగళవారం ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్ధులు పాఠశాల స్థాయి నుంచే క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని ఆయన కోరారు.