SKLM: గార మండలం శ్రీకూర్మం రైతుసేవా కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఫార్మాన్ ఖాన్ బుధవారం పరిశీలించారు. ట్రాక్ షీట్ జనరేషన్ విధానాన్ని ఆన్లైన్లో చూశారు. బిల్లులు విషయంలో రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం శ్రీకూర్మంలోని సాయి శ్రీనివాస మోడ్రన్ రైస్ మిల్లును తనిఖీ చేశారు.