NDL: కొలిమిగుండ్ల మండలంలోని పలు గ్రామాలలో కేంద్ర బృందం బుధవారం పర్యటించింది. గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు అజయ్ కుమార్ సాహూ, రూబుల్ కుమార్ నేతృత్వంలో పంచాయతీరాజ్, గృహ నిర్మాణ, ఉపాధి హామీ పనులను పరిశీలించారు. సామాజిక పింఛన్ లబ్ధిదారులు, స్వయం సహాయక సంఘాల మహిళలతో మాట్లాడి వివరాలు సేకరించారు.