NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల వినాయకుని శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వినాయకుడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.