ATP: సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అనేక వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని మున్సిపల్ ఛైర్పర్సన్ పొరాల శిల్ప పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని 19వ వార్డులో వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో ‘బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా శిల్ప మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో సీఎం చంద్రబాబుకు గట్టి బుద్ధి చెప్పాలన్నారు.