ATP: కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. స్వామివారు, శ్రీ పార్వతీ దేవి అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సీతాలక్ష్మణ సమేత రామచంద్రులు, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామివార్లకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.