AKP: నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కును రద్దు చేయాలని అచ్యుతాపురం జంక్షన్లో సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. ఈ బల్క్ డ్రగ్ పార్కు వద్ద సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు జీవన భృతి కోల్పోతారని సీఐటీయూ మండల కన్వీనర్ సోమునాయుడు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కంపెనీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.