ASR: చింతపల్లి మండలంలోని బెన్నవరం పంచాయతీలో సర్పంచ్ బచ్చలి సన్యాసమ్మ ఆధ్వర్యంలో బుధవారం వీధి దీపాలు ఏర్పాటు చేశారు. పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఆమె స్వయంగా పనులను పర్యవేక్షించారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పట్ల కృషి కొనసాగిస్తామని ఆమె తెలిపారు. వీధి దీపాల ఏర్పాటు పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.