VSP: ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచించారు. గురుజాడ కళాక్షేత్రంలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో బీఎల్వోలు, అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ప్రస్తుత జాబితాను 2002 జాబితాతో సరిపోల్చి డూప్లికేట్లు, లోపాలు లేకుండా ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు.