కోనసీమ: రావులపాలెం మండలంలో ఇంటి పన్నుల వసూళ్లు కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు ఎంపీడీవో సుబ్రహ్మణ్యం తెలిపారు. మండలంలోని ఊబలంక, వెదిరేశ్వరం, రావులపాడు గ్రామాలలో ఇంటిపన్ను వసూళ్లను ఆయన శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటి పన్ను వసూళ్లలో వెనుకబడి ఉన్న గ్రామాల్లో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, వసూళ్లపై సిబ్బందికి సూచనలు చేశారు.