KRNL: SIR మ్యాపింగ్ ప్రక్రియలో వెనుకబడిన 10 మంది బీఎల్వోలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి చల్లా ఓబులేసు ఆదేశించారు. కర్నూలులోని ఎస్బీఐ కేఎంసీ భవనంలో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్ణీత గడువులోగా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.