SKLM: కాశీబుగ్గ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని దాబాలు, టిఫిన్ సెంటర్లు, స్ట్రీట్ ఫుడ్ దుకాణాలు రాత్రి 11 గంటల తర్వాత మూసివేయాలని కాశీబుగ్గ ఇంఛార్జ్ డీఎస్పీ డి లక్ష్మణరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి 11 గంటల తర్వాత అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయట సంచరించరాదని కోరారు.