సత్యసాయి: సోమందేపల్లి మండల కేంద్రంలో శనివారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పెనుకొండ డీఎస్పీ నరసింగప్ప, సీఐ రాఘవన్ ఆధ్వర్యంలో మండలంలోని పలు కాలనీలలో ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నంబర్ ప్లేట్లు, సరైన రికార్డులు లేని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.