VZM: ఎస్‌కోట మండలం పల్లపు దుంగాడ గ్రామానికి మంజూరైన రోడ్డు నిర్మాణాన్ని సత్వరమే ప్రారంభించాలని నియోజకవర్గ జనసేన నాయకులు వబ్బిన సన్యాసినాయుడు కోరారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ అధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. నిర్మాణం చేపట్టకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తూ శుక్రవారం ఎంపీడీవో సతీష్‌కు వినతి పత్రం అందజేశారు.