కృష్ణా: కేంద్ర ప్రభుత్వం ప్రీమియం పెట్రోల్‌పై రూ.2.30 పెంపు చేయడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. జిల్లాలోని 350 బంకుల్లో రోజుకు 10.50 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగంలో సుమారు 10 శాతం ప్రీమియం వాటా ఉంది. ధర పెంపుతో రోజుకు రూ.2.41 లక్షలు, నెలకు రూ.72.45 లక్షలు, ఏడాదికి రూ.8.69 కోట్ల భారం పడనుంది.