VZM: అంగన్వాడీ కేంద్రాలు పరిశుభ్రంగా ఉండాలని జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి, సాధికారిత అధికారిణి టి.విమలారాణి ఆదేశించారు. ఆమె గురువారం విజయనగరం ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టు పరిధిలోని వీ.టీ. అగ్రహారం- 1, 2, 3 అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల నిర్వహణ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, సిబ్బందికి పలు ఆదేశాలను జారీ చేశారు.