సత్యసాయి: శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇవాళ రాత్రి 7.30 గంటలకు వెండి రథ ప్రాకారోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉ. 7 నుంచి 9 గంటల మధ్య స్వామివారికి అభిషేకం, స్వర్ణకవచ సేవలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, తిరిగి సా.5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తులకు స్వామివారి సర్వదర్శనం కల్పిస్తారు.