KDP: బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని సచివాలయం సిబ్బంది లేక ఖాళీ కుర్చీలు వుండడంతో పనులపై వచ్చినవారు అధికారులు లేక వెనుదిరిగారు. ఈ రోజు సెలవు దినం కాదు మరి అధికారులు ఏమైయారని కనీసం ఆఫీస్కు తాళం కూడా వేయకుండా సిబ్బంది కాని, అధికారి కాని లేకుండా పోయారని అసహనం వ్యక్తం చేశారు. ఇటువంటివి సమస్య మళ్లీ పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.