అన్నమయ్య: బోయనపల్లిలో గిరిధర్ రాజుపై హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ అయ్యారు. ప్రియా లేడీస్ హాస్టల్ వద్ద పాత కక్షలతో కట్టెలు, ఇనుప రాడ్లతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆలమూరి వెంకట కార్తీక్ రెడ్డి, గుడ్డం ఎర్రి స్వామి రెడ్డిని రిమాండ్కు తరలించారు. మరో 11 మంది నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోందన్నారు. కేసు వివరాలను ఏఎస్పీ మనోజ్ వెల్లడించారు.