ATP: అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖలపై జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల పనితీరు, తల్లీబిడ్డల ఆరోగ్యం, పోషకాహార పంపిణీపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మెడికల్ ఆఫీసర్లు, సీడీపీఓలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు.