కోనసీమ: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపీఎస్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.