కోనసీమ: బుర్రకథ కళా రంగంలో రెండు హంస అవార్డులు అందుకోవడం రామచంద్రపురం ప్రజలకు గర్వకారణమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా బుర్రకథ కళా రంగంలో ప్రతిష్టాత్మక ‘కళారత్న’ (హంస అవార్డు) అందుకున్న గొర్రెల కృష్ణమూర్తిని మంత్రి శుక్రవారం తన కార్యాలయంలో అభినందించారు.