TPT: రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తిరుపతి MP గురుమూర్తి కేంద్ర మంత్రి JP నడ్డాకు శుక్రవారం లేఖ రాశారు. ఖరీఫ్ 2025 సీజన్లో ఎరువుల కొరత రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని, వెంటనే తగినంత యూరియా సరఫరా చేయాలని కోరారు. రాష్ట్రంలో యూరియా అవసరం సుమారు 39 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉందని, అయితే అందుబాటులో ఉన్న నిల్వలు సరిపోవడం లేదని వివరించారు.