ELR: స్వస్థ్ నారీ- సశక్త్ పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరాన్ని బుధవారం కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్.కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కామినేని మాట్లాడారు. గర్భిణీలు క్రమం తప్పకుండా పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా మహిళలందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేయడం జరుగుతుందన్నారు.