CTR: కుప్పం 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా శనివారం అర్బన్, రూరల్, గుడిపల్లి మండలాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని రెస్కో ఎండీ సోమశేఖర్ తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.