W.G: తణుకు మండలం వేల్పూరు గ్రామంలో సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పర్యటించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కే సోలార్ సిస్టంను ఆమె ప్రారంభించారు. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా విద్యుత్ వినియోగదారులకు తక్కువ ఖర్చుతో సోలార్ వినియోగించుకునే విధంగా ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిందన్నారు. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.