GNTR: తెనాలి D3 సెక్షన్ పరిధిలోని నేలపాడు, సోమసుందరపాలెం, కొత్తపాలెం, బుర్రిపాలెం గ్రామాల్లో విద్యుత్ శాఖ అధికారులు గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. మొత్తం 45 బృందాలుగా ఏర్పడి 3,089 సర్వీసులను పరిశీలించగా, నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ వినియోగిస్తున్న 65 సర్వీసులను గుర్తించారు. వారికి రూ.4.84 లక్షల అపరాధ రుసుం విధించారు.