ASR: రాజవొమ్మంగి మండలం అప్పలరాజుపేట గ్రామంలో ఇద్దరిని బుధవారం రాత్రి అరెస్టు చేశామని SI శివకుమార్ తెలిపారు. రాజవొమ్మంగి -అప్పలరాజుపేట గ్రామానికి వెళ్లే R&B రహదారి ప్రక్కన మద్యం సేవిస్తున్న వారిని అరెస్టు చేశామన్నారు. వారిని పోలీస్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశామని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.