VZM: విజయనగరం నియోజకవర్గ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను రెవెన్యూ అధికారులు గురువారం వెల్లడించారు. అసలైన వర్షపాతం 15.0 మిల్లీ మీటర్లుగా నమోదు కాగా, సాధారణ వర్షపాతం 0.1, డీవియేషన్ 14.9 మిల్లీ మీటర్లుగా నమోదైందన్నారు. డీవియేషన్ శాతం 14,900.0గా నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. పంటను జాగ్రత్తపరుచుకోవాలని సూచించారు.