GNTR: గుంటూరులో చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. అధిక లాభాల ఆశచూపి తనను రూ. 1.93 కోట్లు వంచించాడంటూ చిట్ ఫండ్ కంపెనీ డైరెక్టర్ ఈద అంజిరెడ్డిపై అత్తోట గ్రామానికి చెందిన రైతు ఫిర్యాదు చేశారు. ఆకర్షణీయమైన పథకాలతో రైతులను నమ్మించి ఈ నిధులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదుతో అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.