గుంటూరు జిల్లాలో వాణిజ్య అవసరాలకు గృహ వినియోగ LPG సిలిండర్లను అక్రమంగా ఉపయోగిస్తున్న హోటళ్లు, దుకాణాలపై విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దాసరిపాలెం, చౌడవరం, తక్కెళ్లపాడు ప్రాంతాల్లో మొత్తం 17 గృహ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అత్యవసర సరుకుల చట్టం–1955 కింద మూడు కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.